top of page

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రమాదం లో ఉన్నారా? TTS అంటే ఏమిటి?

  • Dr Udaykumar Punukollu
  • May 11, 2024
  • 1 min read


Astrazeneca కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం UK lo 51 cases మరియు సుమారు 1000 కోట్ల దావా వేయడం జరిగింది. సాక్షాత్తు కంపెనీ యాజమాన్యం covishield  వ్యాక్సిన్ వలన అరుదుగా టీటీస్ ( TTS) వచ్చే అవకాశం ఉందని చెప్పడం వలన భయాందోళనలు రేకెత్తాయి.


TTS అంటే Thrombosis with Thrombocytopenia Syndrome. ఇందులో రక్తం గడ్డ కట్టడం తో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య కూడా తక్కువ అవుతుంది . వ్యాక్సిన్ వలన ఏర్పడే ఆంటీబాడీస్ ప్లేటెలిట్స్ నీ యాక్టివేట్ ( ఉత్తేజపరిచి) చేయడం వలన ఈ సమస్య తలెత్తుతుంది. ప్లేటెలెట్స్ యొక్క పని రక్తాన్ని గడ్డ కట్టించడం. ఇలా రక్తం లో clots ఏర్పడడం వలన platelets వాడకం ఎక్కువ అయ్యి వాటి సంఖ్య కూడా తక్కువ అవుతుంది. దీనికి తోడు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన శరీరం లోని ఇమ్యూన్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అయ్యి platelets ni నాశనం చేస్తుంది. రక్తం గడ్డ కట్టడం ( Thrombosis) మరియు ప్లేటిలెట్స్ సంఖ్య తక్కువ అవ్వడం (Thrombocytopenia) ఉంటుంది కాబట్టే TTS ( Thrombosis with Thrombocytopenia) అని అంటాం 



ఈ టీటీఎస్ అనేది సుమారు 2,50000 మంది covishield వ్యాక్సిన్ తీసుకుంటే ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి వ్యాక్సిన్ కి అయినా ఉంటుంది. ఐతే covid వ్యాక్సిన్ లో covishield కి సంబంధించిన adenovirus vector వలన ఈ  TTS సమస్య తలెత్తుతుంది . m-rna వ్యాక్సిన్ ఉత్తమం. 



అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సైంది ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్  వ్యాక్సిన్ తీసుకున్న ఐదు రోజుల నుంచి నెల వరకూ మాత్రమే ఉంటుంది. ఈ TTS లక్షణాలు చెప్పుకుంటే తల నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది, కడుపు నొప్పి, కాళ్ళ వాపు మరియు నొప్పి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు వ్యాక్సిన్ తీసుకున్న 4-6 weeks లోనే ఉంటాయి తప్ప వ్యాక్సిన్ తీసుకున్న 2-3 years తర్వాత రావు. కాబట్టి ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవాల్సిన పని లేదు. 



Dr Udaykumar Punukollu

Senior Consultant - Medical Oncologist, Hyderabad

Comments


bottom of page