top of page

షుగర్ ఉన్నవారికి క్యాన్సర్ రిస్క్ అధికంగా ఉంటుందా? 

Dr Udaykumar Punukollu

Updated: May 2, 2024



డయాబెటిస్ ఉన్న వారిలో క్యాన్సర్ రిస్క్ సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వీరిలో అధిక ఇన్సులిన్ లెవెల్స్ కలిగి ఉండటం


Type 2 డయాబెటిస్ లో " Insulin Resistance" అనే సమస్య ఉంటుంది. దీని వలన శరీరం లో ఇన్సులిన్ స్థాయి బాగా పెరిగి అది కణాల పెరుగుదల ( Cell Growth) కి మరియు కణ విభజన కి తోడ్పడుతుంది . ఇలాంటి సమయం లో డీఎన్ఏ ( DNA) damage జరిగి క్యాన్సర్ కి దారి తీయవచ్చు.


క్యాన్సర్ ( Cancer) కణాలకి గ్లూకోజ్ ఎంతో అవసరం. Simple గా చెప్పాలంటే క్యాన్సర్ కణాలు బతకాలంటే గ్లూకోజ్ కావాలి. ఇన్సులిన్ హార్మోన్ రక్తం లో ఉన్న గ్లూకోజ్ ని కణం లోకి పంపించడం వలన రక్తం లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి . ఇది ఇన్సులిన్ హార్మోన్ యొక్క అసలైన పని. ఈ ప్రక్రియ లో క్యాన్సర్ కణాలు ఉంటే అవి కూడా గ్లూకోజ్ నీ తీసుకుంటాయి. ఈ విధం గా ఇన్సులిన్ క్యాన్సర్ పెరుగుదల కి ఉపయోగ పడుతుంది 


ఇన్సులిన్ "Apoptosis" కి అడ్డుపడుతుంది. అపాప్టాసిస్ అంటే శరీరం లోని అవ్వాంచిత 

కణాలని తొలగించే సహజ సిద్ధమైన ప్రక్రియ. దీనికి అడ్డుపడితే డీఎన్ఏ Damage అయిన కణాలు చనిపోకుండ క్యాన్సర్ కి దారితీస్తాయి 


చివరగా డయాబెటిస్ ఉన్న వారిలో " inflammation" ఉంటుంది. దీని వలన క్యాన్సర్ ఏర్పడడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. 


Diabetes patients lo ముఖ్యంగా 5 Cancers వచ్చే Risk ఉంటుంది. అవెంటంటే..

1. రొమ్ము క్యాన్సర్

2. బ్లాడర్ క్యాన్సర్

3. పేగు క్యాన్సర్ 

4. లివర్ క్యాన్సర్ 

5. పాంక్రియాస్ క్యాన్సర్


క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, బరువు అదుపులో పెట్టుకుంటూ, బ్యాలెన్స్డ్ డైట్ పాటిస్తూ, షుగర్ లెవెల్స్ నీ అదుపులో పెట్టుకుంటే క్యాన్సర్ రిస్క్ నీ కూడా అదుపులో పెట్టుకోవచ్చు


Dr. Uday Kumar Punukollu 

Senior Consultant- Medical Oncologist 

Hyderabad


34 views0 comments

Commentaires


Les commentaires ont été désactivés.
bottom of page